Xossip

Go Back Xossip > ChitChat> No Holds Barred > మీరు చదివిన మంచి పుస్తకం ఏది

Reply Free Video Chat with Indian Girls
 
Thread Tools Search this Thread
  #71  
Old 1st December 2017
lakshmi345's Avatar
lakshmi345 lakshmi345 is offline
Custom title
 
Join Date: 22nd July 2013
Location: Hyderabad
Posts: 2,013
Rep Power: 15 Points: 1843
lakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our community
Quote:
Originally Posted by annepoo View Post
Yandammori vaari rendu gundela chappudu......chadivaa....nice....... baagundi....alane raavuri bharadwaja gaari paakudu raalu kooda chadivaaa......kani adi full book ledu.......evari daggaranna unte post cheyyagalarani korukuntunaaa..........
Annepoo Garu... పాకుడు రాళ్లు నవల..
తెలుగువన్. కామ్ సైట్ లో ఉంది.. ఆన్లైన్లో చదవండి

Reply With Quote
  #72  
Old 18th December 2017
amrutam amrutam is offline
 
Join Date: 17th August 2015
Posts: 96
Rep Power: 8 Points: 273
amrutam has many secret admirers
లక్ష్మి 345 కి నమస్కారాలు ...............

నేను ఒక పుస్తకప్రియుడనని నా అభిప్రాయం....
ప్రస్తుతానికి కొన్నిరకాల పుస్తకాలు మాత్రమే , మీరు మొదలుపెట్టిన ఈ దారం లో నేనుకూడా భాగస్వామిగా ఉండదలచాను................

Reply With Quote
  #73  
Old 18th December 2017
amrutam amrutam is offline
 
Join Date: 17th August 2015
Posts: 96
Rep Power: 8 Points: 273
amrutam has many secret admirers
నిన్న ప్రపంచ తెలుగు మహాసభలకి వెళ్ళినపుడు తెలిసింది.....
సాదారణంగా ప్రతి సంవత్సరం డిసెంబర్లో హైదరాబాద్ జాతీయ పుస్తక మహోత్సవం జరుగుతుంది కానీ ఈసారి .......

31 వ హైదరాబాద్ జాతీయ పుస్తక మహోత్సవం....
18-28 జనవరి 2018 .................
తెలంగాణా కళాభారతి( ఎన్టీఆర్ స్టేడియం) హైదరాబాద్.

Reply With Quote
  #74  
Old 21st December 2017
lakshmi345's Avatar
lakshmi345 lakshmi345 is offline
Custom title
 
Join Date: 22nd July 2013
Location: Hyderabad
Posts: 2,013
Rep Power: 15 Points: 1843
lakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our community
ఈ రోజు ఈ పుస్తకం సమీక్ష చదివా.. ఎవరిదగ్గరైన ఈ పుస్తకం ఈ_బుక్ ఉంటే పంపగలరు




ఛంఘిజ్ ఖాన్ / తెన్నేటి సూరి

ఛంఘిజ్ ఖాన్ ని పరమక్రూరుడైన హంతక నియంతగా జర్మన్ -అమెరికన్ చరిత్రకారులు సృష్టిస్తే, హెన్రీ హేచ్ హౌవర్తు దంపతులు రచించిన మంగోలు ప్రజలచరిత్ర ఆధారంగా తెన్నేటి సూరి ఆయన నిజజీవితాన్ని ఒక అద్భుతమైన నవలగా తీర్చిదిద్దారు. ఆసియా ఖండానికే ఉజ్జ్వల భవిష్యత్తు అందించిన వెలుగు సూర్యుడిగా , మహోన్నత మానవతావాదిగా ఛంఘిజ్ ఖాన్ ని తెలుగువారికి పరిచయం చేసారు.

ఆ పుస్తకం నుండి కొన్ని వాక్యాలు...!!

____________________________________

టెమూజిన్ : సూటూబోడ్గా బట్ టెంగ్రీ ఖాఖాన్ టెమూజిన్ భగత్తూర్ ని మానవమాత్రులెవ్వరూ జయించలేరు.

చమూగా : అండా..నీకింత అహంకారం పనికిరాదు.

టెమూ: అహంకారమనబోకు- ఆత్మ విశ్వాసమను.

చెమూ: పేరేదైనా కానీ- అదే పనికిరాదంటున్నాను. ఎప్పుడో దెబ్బతింటావు.

టెమూ: మానవుడైన వాడికి అలాంటిది తప్పకుండా వుండి తీరాలి. లేకపోతే దమ్మిడీకి కొరగాడు. సరే ...ఈ గుర్రానికు, మనకు తేడా ఏమిటో చెప్పు నువ్వు ?

చెమూ: తేడా ఏముంది. ఏమీ లేదు. దానికి ప్రాణం వుంది..మనకు ప్రాణం వుంది. అంతా ఒక్కటే.

టెమూ: ఓరి నీ వేదాంతం యిదయిపోనూ! కరాచర్ మామదగ్గర పగలూ, రాత్రీ నేర్చుకున్న చదువు ఇదేనట్రా...ఇది జంతువు. దీనికి ఆత్మవిశ్వాసం లేదు. అందుచేతనే బలమైన జంతువై వుండికూడా , మనిషికి లోబడి బానిసై బ్రతుకుతోంది. ఆత్మవిశ్వాసం లేని మనుషుల గతి కూడా యింతే..!!

____________________________________________

"మానవ జీవితంలో బీభత్సకరంగా ఎదురైన ప్రతి ప్రమాదాన్ని బలంగా చేతిలోకి తీసుకుని సుఖం క్రింద మార్చుకుని బ్రతకలేని పిరికిపందవని నేనెప్పుడూ అనుకోలేదు. జీవించడం చేతకాక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం కంటే నీచాతినీచమైన పిరికితనం మరొకటి లేదు."

____________________________________________

"వీరధర్మాలూ, పిరికితనం లాంటి మాటలన్నీ అర్థంపర్థం లేని పిచ్చి మాటలు వాస్తవం వీటికి అతీతంగా వుంటుందని, ఈ రకమైన మాటలతో రెచ్చగొట్టడం దాన్ని మరుగు పుచ్చేందుకు కొందరు వాడే వ్యూహమే."

____________________________________________

"నా దగ్గర రెండు చిరుతగండులున్నాయి - అవి చెరోవైపునా నా పక్కలో పడుకుని నిద్రపోతాయి. - నేను నా చిరుతపులులురెండింటికీ మధ్యా పడుకుని, గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోతూ ఉంటాను - మానవజాతిని మాత్రం నేను అలా నమ్మిఆదమరచి బ్రతకలేను. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక దొంగ దెబ్బ తగులుతూనే ఉంటుంది. చిరుతపులి విషయంలో మనకు ఆ భయమక్కర్లేదు. వాటికి ఎప్పుడు కోపం వస్తుందో మనకి తెలుస్తుంది. వాటికి మన మీద కోపమొస్తే, మనవంక చూచి పెద్ద పెట్టున గర్జించుతై. చంపుతా జాగ్రత్త అని ముందుగా హెచ్చరించుతై. మనకు తాహతు ఉంటే వాటిపై తిరగబడి పోరాడవచ్చు, లేకపోతే నెమ్మదిగా పక్కకు తప్పుకొని ప్రాణాలు కాపాడుకోవచ్చు. మానవమృగాలు మాత్రం అలాంటి అవకాశాలు ఇవ్వవు. పైగా లాలన చేసి, దువ్వి మైమరపుతో
ఉన్నామని తెలియగానే, యే డొక్కలోనో పంజా విసిరి హత్యచేస్తాయి. మానవజాతిలో మోసం చేయని జంతువంటూ చాలా అరుదు."

____________________________________________

"క్రమమేమిటి, అక్రమమేమిటి? ఎవడికి వీలుగా వున్నది వాడికది క్రమం. ఎవరికి వీలు తప్పింది వాడికది అక్రమం!"

__________________________________________

మానవ జీవితంలో ఆకలి, కామం, ఈర్ష్య, క్రోధం, దుఃఖం, సుఖవాంఛలు వున్నాయి. ఇవి మానవునితో పాటు పుట్టిన సహజగుణాలు. ఇవి అణచుకుంటే ఆగేవి కావు. ఆకలిదప్పులు, వాంఛలు తీరాలి. తోటి మానవులతోపాటు తనకూ న్యాయం జరుగుతుందనే ఆత్మతృప్తి ఏర్పడాలి. దుఃఖోపశమనం కలగాలి. అంతవరకూ భూగోళం మీద శాంతి సిద్ధించుతుందనుకోవడం పిచ్చివాడి కలవరింపు.
ఏ నాగరికతను సృష్టించినా మానవుని దృష్టి యావత్తూ పరిసర ప్రకృతిమీదికే వ్యాపిస్తుంది. తాత్కాలిక సమస్యను మాత్రమే అర్థం చేసుకోగలుగుతున్నాడు. అలాంటి సమస్యలన్నీ ప్రభవించడానికి మూలకారకుడైన తనను గురించి తాను అణుమాత్రమైనా ఆత్మశోధన చేసుకోడు. అందుకే యుగయుగాలుగా ఎన్నెన్ని తాత్కాలిక బాహ్యసమస్యల పరాష్కారం చేసుకున్నా, "మానవుడు" పరిష్కారం కాని అనాది సమస్యగా ఇంకా అలానే మిగిలి వున్నాడు.

________________________________________

""తెలిసిపోయింది- మనుషులు బ్రతకటమెందుకో తెలిసిపోయింది. ఎలా బ్రతకాలో తెలిసిపోయింది. నేనూ తెలుసుకున్నాను- సంగీతమంటే ఏమిటో ,కళలంటే ఏమిటో తెలుసుకున్నాను. కృత్రిమత్వం లో జీవం లేదని తెలుసుకున్నాను."

----------------------------------------------------------
"నీకు మరణం ప్రాప్తించుతుందంటే నేను విచారించను. దుఃఖిగా బ్రతుకుతున్నావంటే మాత్రం నేను భరించలేను. నీవు నాకోసంగాని, మరెవరికోసం గాని, మరే విషయంకోసంగాని ఎన్నడూ విచారం మాత్రం పెట్టుకోకు. అన్యాయం జరుగుతున్నదని తోస్తే , చేతనైతే ధైర్యంగా ఎదుర్కో. లేకపోతే మానెయ్యి. అంతేగాని వ్యర్థమైన విచారంవల్ల ప్రయోజనం లేదు. అధర్మాన్ని ప్రతిఘటించవలసి వచ్చినప్పుడు అధర్మాన్ని అధర్మంతో
ఎదుర్కోవాలని మాత్రం చూడకు. అధర్మాన్ని ధర్మంతో ప్రతిఘటించు. అపజయం కలిగితే విచారించకు. తిరిగి విజయం సాధించేవరకూ , ప్రాణం వున్నంతవరకూ పోరాడు."

Reply With Quote
  #75  
Old 21st December 2017
lakshmi345's Avatar
lakshmi345 lakshmi345 is offline
Custom title
 
Join Date: 22nd July 2013
Location: Hyderabad
Posts: 2,013
Rep Power: 15 Points: 1843
lakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our community
Quote:
Originally Posted by amrutam View Post
లక్ష్మి 345 కి నమస్కారాలు ...............

నేను ఒక పుస్తకప్రియుడనని నా అభిప్రాయం....
ప్రస్తుతానికి కొన్నిరకాల పుస్తకాలు మాత్రమే , మీరు మొదలుపెట్టిన ఈ దారం లో నేనుకూడా భాగస్వామిగా ఉండదలచాను................
Welcome

Reply With Quote
  #76  
Old 7th January 2018
Vikatakavi02's Avatar
Vikatakavi02 Vikatakavi02 is offline
Sree
 
Join Date: 25th May 2015
Location: Isi Duniya mein
Posts: 4,606
Rep Power: 16 Points: 4531
Vikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparazi
Quote:
Originally Posted by amrutam View Post
నిన్న ప్రపంచ తెలుగు మహాసభలకి వెళ్ళినపుడు తెలిసింది.....
సాదారణంగా ప్రతి సంవత్సరం డిసెంబర్లో హైదరాబాద్ జాతీయ పుస్తక మహోత్సవం జరుగుతుంది కానీ ఈసారి .......

31 వ హైదరాబాద్ జాతీయ పుస్తక మహోత్సవం....
18-28 జనవరి 2018 .................
తెలంగాణా కళాభారతి( ఎన్టీఆర్ స్టేడియం) హైదరాబాద్.
ప్రతీ యేటా జనవరి ఒకటో తేదీ నుంచి 11వ తేదీ వరకూ విజయవాడలో పి.డబ్ల్యూ. డి. గ్రౌండ్స్*లో (సాదారణంగా) పెద్ద రీతిలో పుస్తక ప్రదర్శన వుంటుంది.
ప్రపంచవ్యాప్తంగా వున్న పుస్తకాలన్నీ అక్కడ లభిస్తాయి. వివిధ దేశాలలోని లైబ్రరిల నుంచి పుస్తకాలు మరియు సెకెండ్ హ్యాండ్ పుస్తకాలు షిప్పింగ్ అయ్యి వస్తాయి కూడా. నేనక్కడ వుండేప్పుడు వెళ్ళేవాడ్ని.
______________________________
HAIL INDIAN DEFENCE

My Favorite Books నాకు నచ్చిన (ఈ-) పుస్తకాలు
Not Just My Favourites... కేవలం నాకిష్టమైన పుస్తకాలనే కాదు...(అన్నీను...)

Reply With Quote
  #77  
Old 7th January 2018
Vikatakavi02's Avatar
Vikatakavi02 Vikatakavi02 is offline
Sree
 
Join Date: 25th May 2015
Location: Isi Duniya mein
Posts: 4,606
Rep Power: 16 Points: 4531
Vikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparazi
Quote:
Originally Posted by lakshmi345 View Post
Annepoo Garu... పాకుడు రాళ్లు నవల..
తెలుగువన్. కామ్ సైట్ లో ఉంది.. ఆన్లైన్లో చదవండి
ఆ సైట్ లోని కథ అసంపూర్ణమైనది లక్ష్మిగారు.
దాన్నే బుక్ గా ఎవరో తయారు చేస్తే ఆ కాపీనే చదివారు మన అన్నెపూ గారు. నాక్కూడా అదే కాపీని పంపారులేఁ... అప్పుడే నాకూ పూర్తి కథ లేదని తెలిసింది.
______________________________
HAIL INDIAN DEFENCE

My Favorite Books నాకు నచ్చిన (ఈ-) పుస్తకాలు
Not Just My Favourites... కేవలం నాకిష్టమైన పుస్తకాలనే కాదు...(అన్నీను...)

Reply With Quote
  #78  
Old 14th February 2018
lakshmi345's Avatar
lakshmi345 lakshmi345 is offline
Custom title
 
Join Date: 22nd July 2013
Location: Hyderabad
Posts: 2,013
Rep Power: 15 Points: 1843
lakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our community
నాకు బాగా నచ్చిన పుస్తకం


కాలాతీత వ్యక్తులు

డా. పి. శ్రీదేవి రచించిన తెలుగు నవల.

రివ్యూ by సరిత్ గారు



ఈనాటి కాలంలో అనవసరమైన నియమాలను నిరసిస్తూ, పురుషాధిక్యతను ప్రతిఘటిస్తూ, తమపై అనేక రూపాల్లో జరుగుతున్న సామాజిక అత్యాచారాలపై పోరాడుతున స్త్రీశక్తి యొక్క ప్రారంభదశను 6వ దశాబ్దంలో రచయిత ఈ నవలలో ప్రదర్శించారు. ఇది తెలుగు స్వతంత్ర మాసపత్రికలో 7-9-1957 నుండి 25-1-1958 వరకు 21 వారాలు ధారావాహికగా వెలువడింది.

ఈ నవల ఆధారంగా తెలుగులో చదువుకున్న అమ్మాయిలు (1963) అనే సినిమాను నిర్మించారు.
పాత్రలు

ప్రకాశం - వైద్య విద్యార్థి
కృష్ణమూర్తి - ప్రకాశం స్నేహితుడు
ఇందిర
ఆనందరావు - ఇందిర తండ్రి
కళ్యాణి - ఇందిర స్నేహితురాలు
వసుంధర - కళ్యాణి క్లాస్ మేట్
డాక్టర్ చక్రవర్తి
సంక్షిప్త కథాగమనం

విశాఖపట్నంలో ఒక మేడపైనున్న గదిలో అద్దెకుంటున్న ప్రకాశం వైద్య విద్యార్థి. కొన్నాళ్ళ క్రితం ఇందిర అనే వర్కింగ్ గర్ల్ తన తండ్రితో సహా క్రింది వాటాలో దిగింది. ఇందిర నాన్నగారు ఆనందరావుకు సుస్తీ చేస్తే ప్రకాశం ఆయనను కె.జి.హెచ్.లో అవసరమైన ప్రాథమిక చికిత్స చేయించాడు. అలా ప్రారంభమైన పరిచయంతో ఇందిర తండ్రి ఆరోగ్యం గురించి ఏదో అడగడానికని వచ్చి కబుర్లు పెట్టుకొని కదిలేది కాదు. రాత్రి గదికి తిరిగివచ్చిన ప్రకాశంతో పిచ్చాపాటీ మాట్లాడుతూ కూర్చుండిపోయేది. ఒక్కోసారి ఆమె రాకపోకలు చికాకు కలిగించేవి.

ప్రకాశం స్నేహితుడు కృష్ణమూర్తికి చదువు తప్ప అన్నీ చేతనవగా బి.ఎ. పరీక్ష తప్పి చదువున్నాడు. ప్రకాశం కోసమని వచ్చిన కృష్ణమూర్తికి ఇందిర మెరుపుతీగలాగా కనిపించి పరిచయం చేసుకున్నాడు. పరిచయం అయినరోజునే ఇద్దరూ ప్రకాశం గదిలో ఎడతెరిపి లేకుండా కబుర్లు చెప్పుకున్నారు. కృష్ణమూర్తికి జల్సాలకు డబ్బు ఖర్చుపెట్టడం సరదా, అమ్మాయిల మీద మోజు. ఇద్దరికీ చాలా విషయాల్లో శృతి కలిసి ఇద్దరూ బాగా తిరిగేవారు.

ఇందిర స్నేహితురాలు కళ్యాణి ఇంటర్ చదువుతున్నప్పటి క్లాస్ మేట్. పరిచయమైన తర్వాత ప్రకాశానికి ఆమె మీద అభిమానం కలిగింది. కళ్యాణి ఎవరితోనైనా మృదువుగా, వినయంగా మాట్లాడుతుంది. ఆమెతో మాట్లాడుతుంటే అతనికేదో ఓదార్పు, ఊరక కలిగేవి. కల్యాణికి టైఫాయిడ్ సోకగా ప్రకాశం ఆమెను కె.జి.హెచ్.లో చేర్పించాడు. కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఆ నెలరోజులూ తనంటే ప్రకాశం పడిన ఆదుర్దా, చూపిన శ్రద్ధా కళ్యాణి హృదయాన్ని కృతజ్ఞతతో నింపివేశాయి. వీరిద్దరూ దగ్గరవడం ఇందిర సహించ లేకపోయింది. సూటిపోటి మాటలతో సున్నితమైన కళ్యాణి మనస్సును గాయపరిచింది. కళ్యాణి తల్లి ప్రేమ ఎరుగదు. ప్రకాశం చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాడు. వారిద్దరూ పరస్పరం బాధాకరమైన తమ కుటుంబ నేపథ్యాలను చెప్పుకొనేవారు. ఇంతలో కళ్యాణి తండ్రి చనిపోయాడు. ప్రకాశం దారి ఖర్చులకు డబ్బిచ్చి చదువైపోయేదాకా సహాయపడతానని మాటిస్తాడు. రైల్లో క్లాస్ మేట్ వసుంధర పరిచయమై ఇందిర తన గురించి చెడు ప్రచారం గురించి తెలియజేస్తుంది. కళ్యాణి బాధలకు స్పందించి వసుంధరకు తనింట్లో నీడ ఇచ్చి సోదరిలా చూసుకుంది.

చివరకు కృష్ణముర్తి - ఇందిర, డాక్టర్ చక్రవర్తి - కళ్యాణి రెండు జంటలూ తిరుపతి కొండమీద దంపతులుగా మారతారు.
------------------

“కాలాతీత వ్యక్తులు ” తప్పని సరిగా చదివాల్సిన నవల
” సూరీడు వెలుగులో చేయలేని చాలా పనులు వీధి దీపాల వెలుగులో నిరభ్యంతరంగా చేసేయ్యవచ్చు ”
” దేవుడా ! నువ్వనేవాడిని అసలుంటే నీ మీద నాకెప్పుడూ నమ్మకం లేకుండా చెయ్యి ! దేవుడి మీద నమ్మకం నాలోంచి శాశ్వతంగా తీసేయ్యి ! అంతే నే కోరేది “
” ఇదో వింత ప్రపంచం ! కావాలని బాధ పడే వారికేవీ దొరకవు! దొరికే అవకాశమున్న కొందరు తీసుకోరు. మొదటిది ఎంత విచారకరమో ! రెండోది అంతే !
” ఏదో ఒక విశ్వాసం ! నమ్మకం లేనిదే మనిషి బ్రతకలేడు దేని మీద నమ్మకం పెట్టుకున్నా చివరికది చెరిగిపోవచ్చు , దానివల్లే గాయపడవచ్చు , అయినా గత్యంతరం లేదు , మనిషి జీవించటానికి మరో పద్దతి లేదు “
ఎంత గొప్ప నిజాలు ! ఏ కాలంలో అయినా నిలిచిపోయే నిజాలు ! ఏ మనో వైజ్ఞానిక శాస్త్ర వేత్తో 2015 లో అనేక పరిశోధనల తర్వాత తేల్చిన నిజాలు కాదు, 1957 లో ఒక తెలుగు నవల లో చెప్పిన నిజాలు
అప్పటి పరిస్థితులను బట్టి రాసినా, ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుంది. .ఎప్పటికీ మారని మనుషుల మనస్తత్వాలను మన కళ్లముందుంచుతుంది . ఈ నవలలో నాలుగు ముఖ్య పాత్రలు, ఇందిర, ప్రకాశం, కళ్యాణి, కృష్ణమూర్తి . నలుగురివి నాలుగు విభిన్న మనస్తత్వాలు . ఇందిర పాత్ర చుట్టూ మిగతా పాత్రలు తిరుగుతూ ఉంటాయి.
ధైర్యం , సమాజం పట్ల ఒక ఖచ్చితమైన ధృక్పధం, తన పెరిగిన పరిస్థితుల ఆధారంగా సమాజాన్ని అర్ధం చేసుకొని తను జీవించాలంటే సమాజంతో ఎలా మెలగాలో సరిగ్గా అర్ధం చేసుకున్న పాత్ర ఇందిరది.చూసే వారికి అది స్వార్ధం లా అనిపించినా ఆమె నేపధ్య కోణం లో ఆలోచిస్తే ఆమెకు అంతకన్నా మరో మార్గాంతరం కూడా లేదు . ఇలాంటి అమ్మాయలు ఇప్పుడు కోకొల్లలు
ఆత్మ విశ్వాసం నిండా ఉండి, ఎటూ ఆసరా లేకపోయినా తన వ్యక్తిత్వాన్ని ఏ మాత్రం చంపుకోకుండా ఎవ్వరితోనూ కూడా
కూడా స్వార్ధపరురాలు అనే ముద్ర వేసుకోకుండా , ఎవ్వరి సహాయం ఆశించకుండా తన కాళ్ళ మీద తాను నిలబడుతూనే ఎక్కడా స్త్రీ సహజమైన మృదుత్వాన్ని, మూర్తీభవించిన ప్రేమ తత్వాన్ని కోల్పోకుండా ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదు, తనతో పాటు సమాజం మీద కూడా అంతులేని ప్రేమ ఉంటే తప్ప సాధ్యం కాదు, అలాంటి పాత్రే కళ్యాణి ది, చూసే వారికి ఆమె సమాజం నుండి పారిపోతుంది అనిపించేలా ఉంటుంది కానీ అమె మనుషులను , సమాజాన్ని ప్రేమిస్తుంది అని తరచి చూస్తే కానీ అర్ధం కాదు . ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయలు చాలా అరుదు .
తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు కోట్లలో ఉండి, ఎలాంటి బాదరబందీలు లేకపోవటం మనిషిని ఎంతలా ప్రభావం చేస్తుంది చూడాలంటే కృష్ణమూర్తి పాత్రలో చూడాలి, ఇతనికి జీవితంలో బాధల రుచి ఎలా తెలియదో సుఖాల రుచి కూడా తెలియదు, నిజానికి అతనికి సుఖానికి బాధకి మధ్య తేడా కూడా తెలియదు జీవితం లో ఏదీ అతన్ని బలంగా తాకాడు . జీవితపు లోతులు, ఎత్తులు ఏవి తెలియవు, తనను స్వార్ధం కోసం వాడుకున్న వారిని చూసి లోకం గురించి ఆశ్చర్యపోతాడు, తనను ప్రేమించటానికి సిద్దపడ్డ ఒకరిని చూసి వారి స్థాయి సంస్కారానికి తాను తూగను, అంత సంస్కారం తనకు లేదు అని పక్కకు తప్పుకోవటం నిజంగా గొప్ప సంస్కారం ,చూసేవారికి నిర్లక్ష్యంగా కనిపించినా లోతుల్లో స్వచ్ఛంగా కనిపించే పాత్రం ఇతనిది, ఇలాంటి పాత్రలు నిజజీవితంలో ఉంటాయి కానీ గుర్తించటం చాలా కష్టం
ఇక మిగిలినది ప్రకాశం చాలా బుద్దిమంతుడైన కుర్రాడు, మేనమామ చాటు పిల్లాడు, మామయ్య మాటకు ఎదురు చెప్పలేని బలహీనత . బలమైన వ్యక్తిత్వం కలిగిన ఇందిర కనిపించగానే ఆ ప్రభావం తన మీద పడుతుంది అన్న భయం తో తప్పించుకొని తిరుగుతూ ఆమె సాంగత్యాన్ని కోరుకుంటూ ఉంటాడు, తనలాగే సున్నిత భావాలున్న కళ్యాణి కనిపించగానే ఆమెని ప్రేమిస్తాడు . ఆమె కళ్ళముందు కనిపించకుండా పోగానే ఆ వెలితి పూడ్చుకోవటానికి ఇందిర కు దగ్గరవుతాడు, ఆ పిరికీ గుండే లో ఉన్న మంచి తనాన్ని చూసి ఇందిర కూడా ఇష్టపడుతుంది . మేనమామ వ్యక్తిత్వమే తన వ్యక్తిత్వం తప్ప సొంత వ్యక్తిత్వం లేని ప్రకాశం చివరకు మేనమామ వెంట బయల్దేరి , మధ్యలో ఇందిర సాంగత్యం కోరుకొని సాధ్యం కాకపోవటంతో ఇందిర కూడా మోసం చేసింది అన్న భావనతో మేనమామ చూపించిన సంబంధం చేసుకొనే పాత్ర, చూసే వారికి పిరికి వాడిలా కనిపించే స్వార్ధ పరుడు ప్రకాశం . సమాజంలో ఇలాంటి వాళ్ళే ఎక్కువమంది ఉంటారు
ఇలాంటి భిన్న ధృవాల లాంటి వ్యక్తిత్వ ప్రదర్శన తో రాసిన నవలే “కాలాతీత వ్యక్తులు ” నిజంగానే ఈ మనస్తత్వాలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయి, దీనిలో వ్యక్తిత్వాలు కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడు మన కళ్ళముందే ఉంటాయి,
తెలుగు లో వచ్చిన అతి గొప్ప నవలల్లో ఒకటైన ఈ నవలను నేను చాలా లేట్ గా చదివాను(సరిత్ గారు), తప్పని సరిగా చదివాల్సిన నవల ,Dont miss it.


Download link

https://www.mediafire.com/download/mmodrhaq3olay75

Reply With Quote
  #79  
Old 14th February 2018
lakshmi345's Avatar
lakshmi345 lakshmi345 is offline
Custom title
 
Join Date: 22nd July 2013
Location: Hyderabad
Posts: 2,013
Rep Power: 15 Points: 1843
lakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our community
నాకు బాగా నచ్చిన పుస్తకం


కాలాతీత వ్యక్తులు

డా. పి. శ్రీదేవి రచించిన తెలుగు నవల.

రివ్యూ by సరిత్ గారు



ఈనాటి కాలంలో అనవసరమైన నియమాలను నిరసిస్తూ, పురుషాధిక్యతను ప్రతిఘటిస్తూ, తమపై అనేక రూపాల్లో జరుగుతున్న సామాజిక అత్యాచారాలపై పోరాడుతున స్త్రీశక్తి యొక్క ప్రారంభదశను 6వ దశాబ్దంలో రచయిత ఈ నవలలో ప్రదర్శించారు. ఇది తెలుగు స్వతంత్ర మాసపత్రికలో 7-9-1957 నుండి 25-1-1958 వరకు 21 వారాలు ధారావాహికగా వెలువడింది.

ఈ నవల ఆధారంగా తెలుగులో చదువుకున్న అమ్మాయిలు (1963) అనే సినిమాను నిర్మించారు.
పాత్రలు

ప్రకాశం - వైద్య విద్యార్థి
కృష్ణమూర్తి - ప్రకాశం స్నేహితుడు
ఇందిర
ఆనందరావు - ఇందిర తండ్రి
కళ్యాణి - ఇందిర స్నేహితురాలు
వసుంధర - కళ్యాణి క్లాస్ మేట్
డాక్టర్ చక్రవర్తి
సంక్షిప్త కథాగమనం

విశాఖపట్నంలో ఒక మేడపైనున్న గదిలో అద్దెకుంటున్న ప్రకాశం వైద్య విద్యార్థి. కొన్నాళ్ళ క్రితం ఇందిర అనే వర్కింగ్ గర్ల్ తన తండ్రితో సహా క్రింది వాటాలో దిగింది. ఇందిర నాన్నగారు ఆనందరావుకు సుస్తీ చేస్తే ప్రకాశం ఆయనను కె.జి.హెచ్.లో అవసరమైన ప్రాథమిక చికిత్స చేయించాడు. అలా ప్రారంభమైన పరిచయంతో ఇందిర తండ్రి ఆరోగ్యం గురించి ఏదో అడగడానికని వచ్చి కబుర్లు పెట్టుకొని కదిలేది కాదు. రాత్రి గదికి తిరిగివచ్చిన ప్రకాశంతో పిచ్చాపాటీ మాట్లాడుతూ కూర్చుండిపోయేది. ఒక్కోసారి ఆమె రాకపోకలు చికాకు కలిగించేవి.

ప్రకాశం స్నేహితుడు కృష్ణమూర్తికి చదువు తప్ప అన్నీ చేతనవగా బి.ఎ. పరీక్ష తప్పి చదువున్నాడు. ప్రకాశం కోసమని వచ్చిన కృష్ణమూర్తికి ఇందిర మెరుపుతీగలాగా కనిపించి పరిచయం చేసుకున్నాడు. పరిచయం అయినరోజునే ఇద్దరూ ప్రకాశం గదిలో ఎడతెరిపి లేకుండా కబుర్లు చెప్పుకున్నారు. కృష్ణమూర్తికి జల్సాలకు డబ్బు ఖర్చుపెట్టడం సరదా, అమ్మాయిల మీద మోజు. ఇద్దరికీ చాలా విషయాల్లో శృతి కలిసి ఇద్దరూ బాగా తిరిగేవారు.

ఇందిర స్నేహితురాలు కళ్యాణి ఇంటర్ చదువుతున్నప్పటి క్లాస్ మేట్. పరిచయమైన తర్వాత ప్రకాశానికి ఆమె మీద అభిమానం కలిగింది. కళ్యాణి ఎవరితోనైనా మృదువుగా, వినయంగా మాట్లాడుతుంది. ఆమెతో మాట్లాడుతుంటే అతనికేదో ఓదార్పు, ఊరక కలిగేవి. కల్యాణికి టైఫాయిడ్ సోకగా ప్రకాశం ఆమెను కె.జి.హెచ్.లో చేర్పించాడు. కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఆ నెలరోజులూ తనంటే ప్రకాశం పడిన ఆదుర్దా, చూపిన శ్రద్ధా కళ్యాణి హృదయాన్ని కృతజ్ఞతతో నింపివేశాయి. వీరిద్దరూ దగ్గరవడం ఇందిర సహించ లేకపోయింది. సూటిపోటి మాటలతో సున్నితమైన కళ్యాణి మనస్సును గాయపరిచింది. కళ్యాణి తల్లి ప్రేమ ఎరుగదు. ప్రకాశం చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాడు. వారిద్దరూ పరస్పరం బాధాకరమైన తమ కుటుంబ నేపథ్యాలను చెప్పుకొనేవారు. ఇంతలో కళ్యాణి తండ్రి చనిపోయాడు. ప్రకాశం దారి ఖర్చులకు డబ్బిచ్చి చదువైపోయేదాకా సహాయపడతానని మాటిస్తాడు. రైల్లో క్లాస్ మేట్ వసుంధర పరిచయమై ఇందిర తన గురించి చెడు ప్రచారం గురించి తెలియజేస్తుంది. కళ్యాణి బాధలకు స్పందించి వసుంధరకు తనింట్లో నీడ ఇచ్చి సోదరిలా చూసుకుంది.

చివరకు కృష్ణముర్తి - ఇందిర, డాక్టర్ చక్రవర్తి - కళ్యాణి రెండు జంటలూ తిరుపతి కొండమీద దంపతులుగా మారతారు.
------------------

కాలాతీత వ్యక్తులు తప్పని సరిగా చదివాల్సిన నవల
సూరీడు వెలుగులో చేయలేని చాలా పనులు వీధి దీపాల వెలుగులో నిరభ్యంతరంగా చేసేయ్యవచ్చు
దేవుడా ! నువ్వనేవాడిని అసలుంటే నీ మీద నాకెప్పుడూ నమ్మకం లేకుండా చెయ్యి ! దేవుడి మీద నమ్మకం నాలోంచి శాశ్వతంగా తీసేయ్యి ! అంతే నే కోరేది
ఇదో వింత ప్రపంచం ! కావాలని బాధ పడే వారికేవీ దొరకవు! దొరికే అవకాశమున్న కొందరు తీసుకోరు. మొదటిది ఎంత విచారకరమో ! రెండోది అంతే !
ఏదో ఒక విశ్వాసం ! నమ్మకం లేనిదే మనిషి బ్రతకలేడు దేని మీద నమ్మకం పెట్టుకున్నా చివరికది చెరిగిపోవచ్చు , దానివల్లే గాయపడవచ్చు , అయినా గత్యంతరం లేదు , మనిషి జీవించటానికి మరో పద్దతి లేదు
ఎంత గొప్ప నిజాలు ! ఏ కాలంలో అయినా నిలిచిపోయే నిజాలు ! ఏ మనో వైజ్ఞానిక శాస్త్ర వేత్తో 2015 లో అనేక పరిశోధనల తర్వాత తేల్చిన నిజాలు కాదు, 1957 లో ఒక తెలుగు నవల లో చెప్పిన నిజాలు
అప్పటి పరిస్థితులను బట్టి రాసినా, ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుంది. .ఎప్పటికీ మారని మనుషుల మనస్తత్వాలను మన కళ్లముందుంచుతుంది . ఈ నవలలో నాలుగు ముఖ్య పాత్రలు, ఇందిర, ప్రకాశం, కళ్యాణి, కృష్ణమూర్తి . నలుగురివి నాలుగు విభిన్న మనస్తత్వాలు . ఇందిర పాత్ర చుట్టూ మిగతా పాత్రలు తిరుగుతూ ఉంటాయి.
ధైర్యం , సమాజం పట్ల ఒక ఖచ్చితమైన ధృక్పధం, తన పెరిగిన పరిస్థితుల ఆధారంగా సమాజాన్ని అర్ధం చేసుకొని తను జీవించాలంటే సమాజంతో ఎలా మెలగాలో సరిగ్గా అర్ధం చేసుకున్న పాత్ర ఇందిరది.చూసే వారికి అది స్వార్ధం లా అనిపించినా ఆమె నేపధ్య కోణం లో ఆలోచిస్తే ఆమెకు అంతకన్నా మరో మార్గాంతరం కూడా లేదు . ఇలాంటి అమ్మాయలు ఇప్పుడు కోకొల్లలు
ఆత్మ విశ్వాసం నిండా ఉండి, ఎటూ ఆసరా లేకపోయినా తన వ్యక్తిత్వాన్ని ఏ మాత్రం చంపుకోకుండా ఎవ్వరితోనూ కూడా
కూడా స్వార్ధపరురాలు అనే ముద్ర వేసుకోకుండా , ఎవ్వరి సహాయం ఆశించకుండా తన కాళ్ళ మీద తాను నిలబడుతూనే ఎక్కడా స్త్రీ సహజమైన మృదుత్వాన్ని, మూర్తీభవించిన ప్రేమ తత్వాన్ని కోల్పోకుండా ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదు, తనతో పాటు సమాజం మీద కూడా అంతులేని ప్రేమ ఉంటే తప్ప సాధ్యం కాదు, అలాంటి పాత్రే కళ్యాణి ది, చూసే వారికి ఆమె సమాజం నుండి పారిపోతుంది అనిపించేలా ఉంటుంది కానీ అమె మనుషులను , సమాజాన్ని ప్రేమిస్తుంది అని తరచి చూస్తే కానీ అర్ధం కాదు . ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయలు చాలా అరుదు .
తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు కోట్లలో ఉండి, ఎలాంటి బాదరబందీలు లేకపోవటం మనిషిని ఎంతలా ప్రభావం చేస్తుంది చూడాలంటే కృష్ణమూర్తి పాత్రలో చూడాలి, ఇతనికి జీవితంలో బాధల రుచి ఎలా తెలియదో సుఖాల రుచి కూడా తెలియదు, నిజానికి అతనికి సుఖానికి బాధకి మధ్య తేడా కూడా తెలియదు జీవితం లో ఏదీ అతన్ని బలంగా తాకాడు . జీవితపు లోతులు, ఎత్తులు ఏవి తెలియవు, తనను స్వార్ధం కోసం వాడుకున్న వారిని చూసి లోకం గురించి ఆశ్చర్యపోతాడు, తనను ప్రేమించటానికి సిద్దపడ్డ ఒకరిని చూసి వారి స్థాయి సంస్కారానికి తాను తూగను, అంత సంస్కారం తనకు లేదు అని పక్కకు తప్పుకోవటం నిజంగా గొప్ప సంస్కారం ,చూసేవారికి నిర్లక్ష్యంగా కనిపించినా లోతుల్లో స్వచ్ఛంగా కనిపించే పాత్రం ఇతనిది, ఇలాంటి పాత్రలు నిజజీవితంలో ఉంటాయి కానీ గుర్తించటం చాలా కష్టం
ఇక మిగిలినది ప్రకాశం చాలా బుద్దిమంతుడైన కుర్రాడు, మేనమామ చాటు పిల్లాడు, మామయ్య మాటకు ఎదురు చెప్పలేని బలహీనత . బలమైన వ్యక్తిత్వం కలిగిన ఇందిర కనిపించగానే ఆ ప్రభావం తన మీద పడుతుంది అన్న భయం తో తప్పించుకొని తిరుగుతూ ఆమె సాంగత్యాన్ని కోరుకుంటూ ఉంటాడు, తనలాగే సున్నిత భావాలున్న కళ్యాణి కనిపించగానే ఆమెని ప్రేమిస్తాడు . ఆమె కళ్ళముందు కనిపించకుండా పోగానే ఆ వెలితి పూడ్చుకోవటానికి ఇందిర కు దగ్గరవుతాడు, ఆ పిరికీ గుండే లో ఉన్న మంచి తనాన్ని చూసి ఇందిర కూడా ఇష్టపడుతుంది . మేనమామ వ్యక్తిత్వమే తన వ్యక్తిత్వం తప్ప సొంత వ్యక్తిత్వం లేని ప్రకాశం చివరకు మేనమామ వెంట బయల్దేరి , మధ్యలో ఇందిర సాంగత్యం కోరుకొని సాధ్యం కాకపోవటంతో ఇందిర కూడా మోసం చేసింది అన్న భావనతో మేనమామ చూపించిన సంబంధం చేసుకొనే పాత్ర, చూసే వారికి పిరికి వాడిలా కనిపించే స్వార్ధ పరుడు ప్రకాశం . సమాజంలో ఇలాంటి వాళ్ళే ఎక్కువమంది ఉంటారు
ఇలాంటి భిన్న ధృవాల లాంటి వ్యక్తిత్వ ప్రదర్శన తో రాసిన నవలే కాలాతీత వ్యక్తులు నిజంగానే ఈ మనస్తత్వాలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయి, దీనిలో వ్యక్తిత్వాలు కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడు మన కళ్ళముందే ఉంటాయి,
తెలుగు లో వచ్చిన అతి గొప్ప నవలల్లో ఒకటైన ఈ నవలను నేను చాలా లేట్ గా చదివాను(సరిత్ గారు), తప్పని సరిగా చదివాల్సిన నవల ,Dont miss it.


Download link

https://www.mediafire.com/download/mmodrhaq3olay75

Reply With Quote
  #80  
Old 14th February 2018
lakshmi345's Avatar
lakshmi345 lakshmi345 is offline
Custom title
 
Join Date: 22nd July 2013
Location: Hyderabad
Posts: 2,013
Rep Power: 15 Points: 1843
lakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our communitylakshmi345 is a pillar of our community
Quote:
Originally Posted by Vikatakavi02 View Post
ఆ సైట్ లోని కథ అసంపూర్ణమైనది లక్ష్మిగారు.
దాన్నే బుక్ గా ఎవరో తయారు చేస్తే ఆ కాపీనే చదివారు మన అన్నెపూ గారు. నాక్కూడా అదే కాపీని పంపారులేఁ... అప్పుడే నాకూ పూర్తి కథ లేదని తెలిసింది.

కవి గారూ ఇది చదివి చూడండి

పాకుడు రాళ్లు

https://www.mediafire.com/download/0gb6gl4i62hmv61

Last edited by lakshmi345 : 14th February 2018 at 09:48 PM.

Reply With Quote
Reply Free Video Chat with Indian Girls


Thread Tools Search this Thread
Search this Thread:

Advanced Search

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

vB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off
Forum Jump


All times are GMT +5.5. The time now is 04:00 PM.
Page generated in 0.02234 seconds